గల్లీ నుండి ఢిల్లీ వరకు వీధి కుక్కలు కరుస్తున్న దాడుల ఘటనలు నానాటికి పెరిగిపోతున్నాయి. మీడియాలో వస్తున్న వార్తలు చూసినా చలనం లేదే? సుప్రీం కోర్టు సుమోటాగా ఈ కేసు విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. వీధి కుక్కలు కరిచిన పట్టదా? కుక్కల నియంత్రణలో శస్త్రచికిత్సలు చేయాలన్న ఆదేశాలు ఘోరంగా విఫలం. “దేశం పరువు పోతుందేమో” అని సుప్రీం కోర్టు హెచ్చరించినా సరిపోదా? పిల్లలు, పెద్దలపై కుక్కల మూకుమ్మడి దాడులతో బాధపడుతున్న పట్టదా! న్యాయస్థాన ఆదేశాలను లెక్క చేయరా? ప్రజల ప్రాణాలకు భద్రత ఇవ్వలేరా? ప్రభుత్వాలు ఇన్నాళ్ల నిర్లక్ష్యం వీడి మానవీయ స్పృహతో స్పందించాలి. లేదంటే? సుప్రీం కోర్ట్ ముందు, ప్రజల ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుంది సుమా!
- Advertisment -
