మచ్చ బొల్లారం కార్పొరేటర్ రాజ్ జితేందర్‌నాథ్ వినతి
అల్వాల్ (Alwal) పోలీస్ స్టేషన్ నుంచి జిహెచ్ఎంసి (Ghmc) సర్కిల్ కార్యాలయం వరకు బాక్స్ డ్రెయిన్(Box drain)పై స్లాబ్ నిర్మించాలని కోరుతూ మచ్చ బొల్లారం డివిజన్ కార్పొరేటర్ (Macha Bollaram Division Corporator) రాజ్ జితేందర్ నాథ్ జిహెచ్ఎంసి అల్వాల్ ఉప కమిషనర్ (Deputy Commissioner) శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. సానుకూలంగా స్పందించిన ఉప కమిషనర్ ఆమోదం కోసం అవసరమైన ప్రయత్నాలను ఉన్నతాధికారులతో చేపడతామని హామీ ఇచ్చినట్లు కార్పొరేటర్ తెలియజేశారు. కార్యక్రమంలో సర్వేష్ యాదవ్, ఐజాక్, రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
