Monday, October 27, 2025
ePaper
Homeహైదరాబాద్‌BSP | బీసీల కోసం బీఎస్పీ

BSP | బీసీల కోసం బీఎస్పీ

42% రిజర్వేషన్ విశాల ధర్నా వాల్ పోస్టర్ రిలీజ్ చేసిన

బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్

బీసీ(BC)లకు ప్రస్తుతం ఉన్న 27% రిజర్వేషన్స్ (Reservationa) సాధనలో BSP కీలక పాత్ర పోషించిందని ఆ పార్టీ తెలంగా రాష్ట్ర అధ్యక్షుడు, బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్ తెలిపారు. ఎవరి జనాభా (population) ఎంతో-వారి వాటా అంత అనే నినాదంతో దేశంలో పుట్టిన ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అని చెప్పారు. నేడు తెలంగాణ రాష్ట్రం (Telangana State)లో న్యాయమైన వాటా కోసం జరుగుతున్న BC రిజర్వేషన్స్ పోరాటానికి పూర్తి మద్దతు (Support) ఇస్తామని తెలిపారు.

ఈ సందర్బంగా ఇందిరా పార్క్ (Indira Partk) ధర్నా చౌక్ వద్ద చేపట్టిన విశాల ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ రిజర్వేషన్స్ 42 శాతం అంశాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో చేర్చాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్స్ అమలు కోసం బీఎస్పీ చేసిన పోరాటాన్ని, బహుజన మహనీయుల రాజకీయ ఉద్దేశాన్ని మొత్తం సమాజానికి వివరించి చెప్పాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమానికి లక్షలాది మంది హాజరు అవ్వాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఎస్పీ సెంట్రల్ స్టేట్ కో-ఆర్డినేటర్ దాగిల్ల దయానంద్ రావ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శివరామకృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బోయిని చంద్రశేఖర్ ముదిరాజ్, ప్రభు, శ్రీకాంత్, రాష్ట్ర కోశాధికారి ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News