- బిఆర్ఎస్ గెలుపు నల్లేరుపై నడకే
బిఆర్ఎస్ పార్టీతోనే మున్సిపాలిటీకి సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని 12వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మోర్తలా సునీత రమణారెడ్డి అన్నారు.ఆలేరు మున్సిపల్ రెండవ సాధారణ ఎన్నికలను పురస్కరించుకుని బుధవారం ఆలేరు మున్సిపాలిటీ 12వ వార్డులో గల రెడ్డిగూడెం, బీసీ కాలనీలలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో అమలు కాని హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. బిఆర్ఎస్ గెలుపు నల్లేరుపై నడకే అని ఆవిడ ధీమా వ్యక్తం చేశారు.బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులే ఇందుకు నిదర్శనమని తెలిపారు. గులాబీ జెండాతోనే ప్రజలకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రజలు మరోసారి కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని పేర్కొంటూ, కారు గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మోర్తాల సునీత రమణారెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
