Monday, March 2, 2026
HomeతెలంగాణKCR | రేపు అసెంబ్లీకి కేసీఆర్

KCR | రేపు అసెంబ్లీకి కేసీఆర్

బీఆర్ఎస్ పార్టీ అధినేత(BRS Party President), మాజీ సీఎం కేసీఆర్(Former CM KCR) రేపు అసెంబ్లీ సమావేశాలకు(Assembly Meetings) హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన ఆదివారం సాయంత్రం ఫామ్ హౌజ్ నుంచి బంజారాహిల్స్‌లో నంది నగర్‌లో ఉన్న తన నివాసానికి చేరుకున్నట్లు సమాచారం అందుతోంది. దీంతో.. కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా రారా అనే ఉత్కంఠకు తెరపడింది. గత అసెంబ్లీ ఎన్నికల(Assembly Elections) తర్వాత కేసీఆర్ ఒకటీ రెండు సందర్భాలు మినహా ఎప్పుడూ శాసన సభకు రాలేదు. ఇటీవల ప్రెస్‌మీట్(Press Meet) పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన ఇప్పటివరకు ఒక లెక్క.. ఇకపై మరో లెక్క అని తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కేసీఆర్ ఇక నుంచి క్రియాశీలకంగా ప్రజల్లో ఉంటారనే సంకేతాలు వెలువడుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News