Friday, September 12, 2025
ePaper
spot_img
Homeతెలంగాణఉగ్రవాదం అంతం కావాల్సిందే

ఉగ్రవాదం అంతం కావాల్సిందే

  • ఉగ్రవాదం విషయంలో ప్రపంచ శక్తులు ఏకం కావాలి
  • ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా తుదముట్టించాల్సిందే
  • దేశరక్షణలో ఎవ్వరికీ తీసుపోమని నిరూపణ : కేసీఆర్‌

భారత సైన్యం ప్రదర్శించిన తన సైనిక పాటవానికి ఒక భారతీయుడుగా తాను గర్వపడుతున్నాని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. ఉగ్రవాదం, ఉన్మాదం ఏరూపంలో ఉన్నా.. ఏ దేశంలో వున్నా.. ప్రపంచ మానవాళికి నష్టం కలిగించేదే తప్ప లాభం చేకూర్చేదికాదని అయన పేర్కొన్నారు. ఉగ్రవాదం అంతం కావాల్సిందే అని కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఈ విషయంలో పాజిటివ్‌గా ఆలోచించే ప్రపంచ శక్తులన్నీ ఏకమై, ఉగ్రవాదాన్ని అంతమొందిస్తేనే శాంతి సామరస్యాలు నెలకొంటాయి. భారత సైన్యం ఎంత విరోచితంగా దాడులు చేసిందో అంతే అప్రమత్తంగా వుండి దేశరక్షణలో మేమెవరికి తీసిపోము అన్నట్టుగా వారికి శక్తి సామర్థ్యాలుండాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను అని కేసీఆర్‌ పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News