ఈ నెల 29న ప్రపంచవ్యాప్తంగా (Worldwide) ‘దీక్షా దివస్’ను నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ పార్టీ (BRS Party) ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ (NRI Coordinator) మహేష్ బిగాల (Mahesh Bigala) తెలిపారు. తెలంగాణ రాష్ట్ర (Telangana State) సాధన కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) 2009 నవంబర్ 29న ఆమరణ నిరాహార దీక్ష (Hunger Strike To Death) ప్రారంభించారు. అందుకు గుర్తుగా దీక్షా దివస్‌ను నిర్వహిస్తున్నారు. కేసీఆర్ దీక్షకు కూర్చోవటం వల్లే తెలంగాణ ఉద్యమం కీలక మలుపు తిరిగిందని, కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసిందని మహేష్ బిగాల పేర్కొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆదేశాల నేపథ్యంలో ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఎన్ఆర్ఐ విభాగం సమన్వయంతో దీక్షా దివస్ జరుగుతుందని చెప్పారు.
Deeksha Diwas | ఈ నెల 29న ప్రపంచవ్యాప్తంగా దీక్షా దివస్
- Advertisement -
RELATED ARTICLES
