Wednesday, February 11, 2026
Homeఎన్‌.ఆర్‌.ఐBRS NRI | సీఎం రేవంత్ వ్యాఖ్యలకు ఖండన

BRS NRI | సీఎం రేవంత్ వ్యాఖ్యలకు ఖండన

ప్రవాస భారతీయులను(NRI) అవమానపరిచేలా(Insult) కొడంగల్ మీటింగ్‌(Kodangal Meeting)లో సీఎం రేవంత్(CM Revanth) చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ(BRS NRI) దక్షిణాఫ్రికా అధ్యక్షుడు(South Africa President) గుర్రాల నాగరాజు(Gurrala Nagaraju) ఖండించారు. తెలంగాణ రాష్ట్రానికి గౌరవం తెచ్చేలా ప్రపంచం నలుమూలలా కష్టపడి బతుకుతున్న ఎన్ఆర్ఐలను కించపరిచేలా మాట్లాడటం సరికాదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు అత్యంత దురదృష్టకరంగా ఉన్నాయని ఆయన ఆవేదన వెలిబుచ్చారు.

సీఎం రేవంత్ రెడ్డి వాడిన భాష ప్రజాస్వామ్య వ్యవస్థకు మాయని మచ్చలా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం హోదాలో ఉండి ఇలా దిగజారి మాట్లాడటం బాధాకరమని, రాజకీయ హుందాతనం అనిపించుకోదని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పార్టీని అడ్రస్ లేకుండా చేస్తాననటం, వార్నింగ్‌లు ఇవ్వటం అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలకు ప్రజలు సరైన సమయంలో సరైన సమాధానం చెబుతారని నాగరాజు అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News