Saturday, October 4, 2025
ePaper
Homeరాజకీయంబీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల మెరుపు ధర్నా

బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల మెరుపు ధర్నా

  • పార్టీ ఫిరాయింపులపై త‌క్ష‌ణ అనర్హత వేటు వేయాలని డిమాండ్‌
  • అసెంబ్లీ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద నిరసన – స్పీకర్‌కి వినతిపత్రం

తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో సోమవారం ఉదయం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై తక్షణమే అనర్హత వేటు వేయాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్ఎస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలోని మహాత్మా గాంధీ విగ్రహం వ‌ద్ద‌ మెరుపు ధర్నాకు దిగారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారంపై సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును ప్రస్తావించిన బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు, ఫిరాయింపు రాజకీయం ప్రజాస్వామ్యానికి ముప్పు. స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో, స్పీకర్ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ను కలవడానికి బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల బృందం శాసనసభ కార్యాల‌యానికి వెళ్లారు.. అయితే స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో, గాంధీ విగ్రహం ఎదుటే నిరసన కొనసాగిస్తూ వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ, మలిన రాజకీయాలకు అడ్డుకట్ట వేసే క్రమంలో శాసనసభ స్పీకర్‌ కీలకంగా వ్యవహరించాలి. ప్రజల అభిమతాన్ని తాకట్టు పెట్టే ఫిరాయింపులను ఊహించలేం అని వ్యాఖ్యానించారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News