తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి
పది సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి యూరియా ఎవరిస్తారు ఇస్తారో కూడా తెలవదా అని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రాల్లోని ఆయన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. యూరియాకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇయాల్సిన అవసరం ఉందన్నారు. రేవంత్ రెడ్డి దాచుకొని యూరియా ఇస్తలేనట్టు మాట్లాడుతున్నారు. దమ్ముంటే ఢిల్లీకి పోయి నిరసన తెలపండి అన్నారు.బిఆర్ఎస్, బిజెపి ఒకటే వాళ్ళని ఏమనకుండా ఈరోజు మమ్మల్ని విమర్శించే పరిస్థితి క్రియేట్ చేశారన్నారు.రైతుల్ని ఆదుకోవాలనే దృఢ సంకల్పంతోటి రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. రైతులందరికీ కూడా యూరియా అందించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. అలాగే కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వయిరీ కి అప్పగిస్తే బిఆర్ఎస్ నాయకులు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావట్లేదు అన్నారు. గుమ్మడికాయల దొంగలు అంటే భుజాలు తడుముకున్నట్టు ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క రీతిలో మాట్లాడుతున్న సందర్భం ఈరోజు మనం చూస్తున్నాం అన్నారు.
కేటీఆర్, హరీష్ రావు ముఖ్యంగా జగదీశ్వర్ రెడ్డి ని ఈరోజు మేము సూటిగా అడుగుతున్నాం. సూర్యాపేట జిల్లా కు వచ్చే నీళ్లు కాలేశ్వరం నుంచి వస్తున్నాయా? శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి వస్తున్నాయో సూటిగా చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టుకు లక్ష కోట్ల రూపాయల అని చెప్పి ఈ రోజు లక్ష కోట్ల రూపాయలను కూడా బూడిదలో పోసినట్లు అయిందన్నారు. పొన్నాల లక్ష్మయ్య మంత్రిగా ఉన్నప్పుడు ఓ రెండు మూడు కిలోమీటర్లు కూడా రాయి వస్తే దాన్ని అంతా కూడా పగలగొట్టి,గతం లో కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయినంక ఈ ప్రాంతానికి మొదటిగా నీళ్లు ఇవ్వడం జరిగింది అన్నారు. మరి ఈరోజు జగదీశ్వర్ రెడ్డి వచ్చే నీళ్లు అన్ని కాలేశ్వరంవే అని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ శ్రీనివాస్, సీనియర్ నాయకులు డాక్టర్ రామ్మూర్తి, జ్యోతి కరుణాకర్, స్వామి, వెలుగు వెంకన్న, ఫరూక్, నిమ్మల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.