Monday, October 27, 2025
ePaper
HomeరాజకీయంBC | బిసి రిజర్వేషన్లపై దాగుడుమూతలు

BC | బిసి రిజర్వేషన్లపై దాగుడుమూతలు

కాంగ్రెస్‌ తీరుపై మండిపడ్డ శ్రీనివాసగౌడ్‌

బీసీ రిజర్వేషన్ల బిల్లు గురించి దిల్లీ పెద్దలను సీఎం రేవంత్‌రెడ్డి ఏనాడూ అడగలేదని భారత రాష్ట్ర సమితి నేత, మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ విమర్శించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ నేతలు మొదట చట్ట సవరణ అన్నారని.. తర్వాత ఆర్డినెన్స్‌.. ఇప్పుడు జీవో అంటున్నారన్నారు. బిల్లుల పేరుతో బీసీలను అవమానిస్తే ఊరుకునేది లేదని చెప్పారు. 42 శాతం రిజర్వేషన్లను చట్టబద్ధంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. బీసీలు అడగకపోయినా.. కాంగ్రెస్‌ పార్టీయే హామీ ఇచ్చిందని పేర్కొన్నారు. రిజర్వేషన్ల అమలుపై ఆ పార్టీ మోసం చేస్తోందని దుయ్యబట్టారు. ఈ అంశం విద్య, ఉద్యోగాల్లో లక్షల మంది జీవితాలతో ముడిపడి ఉంది. జీవో ఇచ్చి కేవలం రాజకీయ పదవులకే సరిపెడితే ఊరుకునేది లేదు. రాజకీయ పదవుల్లోనూ బీసీలకు పూర్తి న్యాయం చేయలేదు. బిల్లు ఆమోదం కోసం ఢిల్లీలో ధర్నాలు చేశారు. కానీ.. ఎవరినీ అడగలేదు. విజయోత్సవ సభ పెడుతున్నామని ఎందుకు వెనక్కి తగ్గారని శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రశ్నించారు. మీడియా సమావేశంలో మాజీ స్పీకర్‌, ఎమ్మెల్సీ మధుసూధనాచారి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News