హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలు(TG local body elections) నిర్వహించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ నేతలు మంగళవారం తీవ్ర స్థాయిలో విమర్శించారు. ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను విస్మరించి రాష్ట్రాన్ని రాజరిక పాలనలా నడుపుతోందని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడిన సీనియర్ నాయకులు క్యాలెం మల్లేష్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అసమర్థురాలని విమర్శించారు, వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ గతంలో చేపట్టిన గ్రామీణ అభివృద్ధి పనులను కొనసాగించడంలో ఆమె విఫలమయ్యారని ఆయన ఆరోపించారు.
“ఎంపీటీసీలు, జెడ్పీటీసీల పదవీకాలం ముగిసి ఏడాదికి పైగా అవుతున్నప్పటికీ, ఓటమి భయంతో రిజర్వేషన్ల పేరుతో రేవంత్ రెడ్డి స్థానిక ఎన్నికలను(TG local body elections) వాయిదా వేస్తున్నారని” మల్లేష్ మండిపడ్డారు.కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ వ్యవస్థను సర్వ నాశనం చేసారని ఆయన ఆరోపించారు. సహకార సంఘాల పదవులను తమ వాళ్ళకు కట్టబెట్టేందుకు పదవీ కాలాన్ని పొడిగించి, బీఆర్ఎస్ మద్దతుదారులుగా ఉన్న చైర్మన్లను కాంగ్రెస్ నేతలు పక్కన పెట్టారని ఆయన ఆరోపించారు. “ప్రభుత్వానికి నిజంగా ధైర్యం ఉంటే, సాకులు చెప్పకుండా వెంటనే ఎన్నికలు నిర్వహించాలని” ఆయన సవాల్ విసిరారు.
మరో నాయకుడు వై. సతీష్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని ధ్వజమెత్తారు. సమ్మక్క-సారలమ్మతో సహా ఎన్నో దేవతలపై ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డి, , కాంగ్రెస్ ఎన్నికల మానిఫెస్టోను, ముఖ్యంగా రైతు రుణమాఫీ వాగ్దానాన్ని అమలు చేయడంలో విఫలమయ్యారని ఆయన విమర్శించారు.
మరిన్ని వార్తలు :