- 435 ఓట్ల మెజారిటీతో గెలుపు; మాజీ ఎంపీటీసీకి పట్టం కట్టిన గ్రామ ప్రజలు
సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని నూతనకల్ మండలం, ఎర్రపహాడ్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గాడుదుల లింగరాజు యాదవ్ అద్భుత విజయాన్ని నమోదు చేశారు. గురువారం జరిగిన స్థానిక సంస్థల తొలిపోరులో ఆయన సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై 435 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు.ఎర్రపహాడ్ గ్రామ సర్పంచ్ పదవికి బీఆర్‌ఎస్ తరఫున గాడుదుల లింగరాజు యాదవ్ పోటీ చేయగా, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అనంతుల నాగలింగం బరిలో నిలిచారు.
ఈ గ్రామంలో మొత్తం 2600 ఓట్లు ఉండగా, 2375 ఓట్లు పోలయ్యాయి. గతంలో ఎంపీటీసీగా పనిచేసిన అనుభవం ఉన్న లింగరాజు యాదవ్ నాయకత్వాన్ని గ్రామ ప్రజలు కోరుకుంటూ ఆయనకు సర్పంచ్‌గా పట్టం కట్టారు. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలుపొందినప్పటికీ, మొత్తం 12 వార్డులకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచారు. 12 వార్డులకు గాను, ఏకంగా 11 వార్డుల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందగా, కేవలం ఒక వార్డులో మాత్రమే బీఆర్‌ఎస్ అభ్యర్థి విజయం సాధించారు.
- Advertisement -
