బిఆర్ఎస్ పార్టీతోనే మున్సిపాలిటీకి సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని బహదూర్‌పేట మాజీ సర్పంచ్ జంపాల దశరథ అన్నారు. మున్సిపల్ రెండవ సాధారణ ఎన్నికలను పురస్కరించుకుని బుధవారం ఆలేరు మున్సిపాలిటీ 6వ వార్డు వడ్డెర బస్తీలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి రాయపురం శ్రీనివాస్ గెలుపు కోసం ఆయన విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా జంపాల దశరథ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన అమలు కాని హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులే ఇందుకు నిదర్శనమని తెలిపారు. గులాబీ జెండాతోనే ప్రజలకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రజలు మరోసారి కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని పేర్కొంటూ, కారు గుర్తుకు ఓటు వేసి బిఆర్ఎస్ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమం లో వట్టిపల్లి మొగిలి మల్లయ్య. మొరిగాడి వెంకటేష్ కుండే సంపత్.పిలిఫ్, రాయపురం నరసింహులు దొంతుల ఎల్లేష్, ఆలేటి అరుణ, రాయపురం సుధాకర్, రాయపురం శేఖర్, పల్లె మహేష్. కుల్ల వెంకటేష్. వస్పరి బాలయ్య. సంగి నాగరాజు. చిన్నం వెంకటేష్, తూర్పాటి సమ్మయ్య, తూర్పాటి ఆంధ్రయ, ఎర్రోజు రాజు, తూర్పాటి యాదగిరి, పడతం జాషువా,కర్రే భాస్కర్. జహంగీర్, దొంతుల రామచందర్. తూర్పాటి మోషే. చంద్రమౌళి. రాజయ్య. దావీద్. జాన్.సమ్మయ్య. బీదని యాదగిరి. రాయపురం మహేష్, రాయపురం భాస్కర్,తదితరులు పాల్గొన్నారు.
