Tuesday, February 10, 2026
Homeరంగారెడ్డిArrest | భూమి కోసం చెల్లినే చంపించిన అన్న

Arrest | భూమి కోసం చెల్లినే చంపించిన అన్న

  • న్యాయవాది హత్య కేసులో నలుగురు అరెస్ట్
  • వివరాలు వెల్లడించిన డీసీపీ యోగేశ్ గౌతమ్

రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన మహిళా న్యాయవాది హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే… మహిళా న్యాయవాది గొటికె స్వప్న (34) హత్య కేసులో ఆమె సొంత అన్న గొటికె రాజుతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. భూమి కోసం ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు తేల్చారు.

చేవెళ్ల కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న స్వప్నకు, అన్న రాజుకు మధ్య మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి, సర్వే నెం.339లోని 4 ఎకరాల వారసత్వ భూమిపై వివాదం ఉంది. భూమి మొత్తాన్ని చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో రాజు ఇతరులతో కలిసి హత్యకు కుట్ర పన్నాడు.
గురువారం ఉదయం స్వప్న, ఆమె తల్లి వెంకటమ్మ భూమి సర్వే చేయించుకుంటుండగా, నిందితులు ఇన్నోవా కారు, స్కూటీ, కొడవలితో అక్కడికి వచ్చారు.

- Advertisement -

సర్వే ముగించుకొని వెంకటాపూర్–నక్కలపల్లి రోడ్డుకు దగ్గరగా వస్తుండగా, కారుతో ఢీకొట్టి గుంతలో పడేశారు. వెంటనే కర్రలు, రాళ్లతో దాడి చేసి, కొడవలితో గొంతు కోసి హత్య చేశారు. తల్లి వెంకటమ్మ కళ్లముందే ఈ ఘటన జరిగింది. ఆమె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నలుగురిని అరెస్ట్ చేసి, ఇన్నోవా కారు, స్కూటీ, మొబైల్ ఫోన్లు, కొడవలి సీజ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News