Friday, September 12, 2025
ePaper
spot_img
Homeతెలంగాణనల్గొండ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో దళారుల దందా

నల్గొండ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో దళారుల దందా

  • జిల్లా రిజిస్ట్రార్ ని కూడా లెక్క చేయని వైనం…
  • రిజిస్ట్రార్ ఆఫీస్ లో కలెక్షన్ కింగ్స్…?
  • వార్త రాసిన ఆదాబ్ జర్నలిస్ట్ పై బ్రోకర్ల తిరుగుబాటు..
  • దళారీలను పెంచి పోషిస్తున్న అధికారులు..

నల్గొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దళారుల దందా జోరుగా సాగుతోంది. అధికారులకు దళారులు చెప్పిందే వేదం అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత నెలలో సబ్ రిజిస్టర్ నగేష్ అవినీతి కి పాల్పడడంతో ఆదాబ్ హైదరాబాద్ పత్రిక లో ‘అవినీతికి అడ్డాగా మారిన నల్గొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ..‘శీర్షిక తో కథనం ప్రచురితమైంది. అయినప్పటికీ అటు అధికారులు ఇటు దళారుల హవా మాత్రం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. దళారీల మధ్యవర్తుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ అవినీతి పెంచి పోషిస్తున్నారు. అంతే కాకుండా కార్యాలయానికి సంబంధం లేని బ్రోకర్లు కార్యాలయానికి వచ్చే వారితో నోటికొచ్చినట్లు మాట్లాడుతూ తన పొట్ట కొట్టడం సరైనది కాదని పేర్కొనటం రిజిస్టార్ కార్యాలయంలో జరిగే అవినీతిని ప్రతిబింబిస్తుంది.

జిల్లా రిజిస్టార్ కార్యాలయంలో బయట వ్యక్తులు దళారులు ఎవరు ఉండకూడదని నిబంధనలు ఉన్నాయి, అయినా కూడా అవేమి పట్టించుకోకుండా అధికారులు వారికి వంత పాడటంతో వారి ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. డిస్టిక్ రిజిస్టార్ కార్యాలయం పక్కనే ఉన్నా కూడా దళారులకు అదురు బెదురు లేకుండా డిఆర్ ను లెక్కచేయకుండా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో దళారుల వ్యవస్థను పటిష్టంగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు స్పందించి కార్యాలయం లో అవినీతి కి తావు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని క్రయవిక్రయదారులు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News