Wednesday, October 29, 2025
ePaper
Homeసాహిత్యంPM Modi | మోదీ గురించి రాసిన పుస్తకం ఆవిష్కరణ

PM Modi | మోదీ గురించి రాసిన పుస్తకం ఆవిష్కరణ

ప్రధాని మోదీ గురించి రాసిన పుస్తకాన్ని హైదరాబాద్‌లోని నల్లకుంటలో ఉన్న శంకరమఠం (Shankaramath)లో శ్రీశృంగేరి శారదా పీఠాధిపతి శ్రీశ్రీ విద్యాశేఖర భారతీ స్వామిజీ (Vidyasekhara Bharathi Swamiji)వారు మంగళవారం ఆవిష్కరించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పదేళ్ల పాలనలో సాధించిన విజయాలను విశ్లేషిస్తూ ఈ పుస్తకాన్ని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు (Vakulabharanam Krishnamohan Rao) రాశారు. పుస్తకం పేరు.. ‘శ్రీ నరేంద్ర మోదీ–నిబద్ధ పరిపాలన దక్షుడు’. ఈ సందర్భంగా స్వామిజీ.. గ్రంథంలోని అంశాలపై రచయితతో సమగ్రంగా సంభాషించి తెలుసుకున్నారు. అనంతరం స్వామిజీ.. రచయితను ఆశీర్వదించి, ప్రసాదంతోపాటు గోడ గడియారాన్ని(Wall Clock) బహుమతి(Gift)గా ఇచ్చారు.

వకుళాభరణం మాట్లాడుతూ.. మోదీ 75వ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17న ప్రత్యేక వ్యాసావళి రాసి ఆవిష్కరించానని చెప్పారు. ఇప్పుడు మోదీ పదేళ్ల పాలనలో సాధించిన విజయాలపై సమగ్ర అధ్యయనం చేసి గ్రంథాన్ని రాశానని తెలిపారు. దేశానికే కాకుండా ప్రపంచానికి ఆయన అందించిన నాయకత్వాన్ని (Leadership) పత్రికల వార్తలు, కథనాల ఆధారంగా అందరికీ చేరువ చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News