ఒక్కసారి అవకాశం ఇచ్చి నన్ను గెలిపించండి ఎమ్మెల్యే అండతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానంటూ బోయిన్ పల్లి సర్పంచ్ అభ్యర్థి నల్ల ( గడీల) మోహన్ ఓటర్లను అభ్యర్థిస్తున్నాడు. మండల కేంద్రమైన బోయిన్ పల్లిలో ఆయన బుధవారం ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలుపరుస్తుందని తనకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆశీర్వాదం కూడా ఉందని ఎమ్మెల్యే ద్వారా గ్రామాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తానని అన్నారు తనపై నమ్మకంతో అవకాశం ఇచ్చి కత్తెర గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తానన్నారు .ఈ కార్యక్రమంలో బొజ్జ దేవయ్య, బొజ్జ, ప్రభాకర్ నరేష్, మెరుపుల జలంధర్, ఎడపల్లి అంజయ్య, బొడ్డు నరేష్, తదితరులున్నారు
MLA | ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అండతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తా
By Aadab Desk
- Advertisement -
Previous article
