Tuesday, March 3, 2026
Homeకరీంనగర్Boinpalli | బోయిన్ పల్లి లో కోతుల బెడద సమస్య పరిష్కరించండి

Boinpalli | బోయిన్ పల్లి లో కోతుల బెడద సమస్య పరిష్కరించండి

మండల కేంద్రమైన బోయినపల్లి లో కోతుల బెడద కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బోయిన్ పల్లి గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 15 సంవత్సరాలుగా గ్రామంలో కోతుల సమస్య ఉన్నప్పటికీ గత పాలకులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ఎంతోమందికి కోతుల కారణంగా ప్రమాదాలు కూడా జరిగిన దాఖలాలు ఉన్నాయి. ఈ కోతుల సమస్యను పరిష్కరించేందుకు ప్రజా ప్రతినిధులు కానీ అధికారులు కానీ పట్టింపు ధోరణి లేకపోవడంతో సమస్య రోజురోజుకు తీవ్రమవుతుందని పలువురు అంటున్నారు. కోతుల కారణంగా రోజు తలుపులు బిగించుకొని ఉండాల్సిన పరిస్థితి నెలకొంటుందని బయటకు వెళ్లాలంటే ఏ కోతి ఎప్పుడు మీద పడుతుందోనని భయం చెందవలసిన పరిస్థితులు దాపురించాయని పలువురు అంటున్నారు ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News