కరీంనగర్: బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నడిచే ట్రాక్టర్ వాహనాల డ్రైవర్ల కు యజమానులకు బోయిన్ పల్లి ఎస్సై రమాకాంత్ శుక్రవారం నాడు వాహన నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డ్రైవర్లు యజమానులను పోలీస్ స్టేషన్కు పిలిపించి, సబ్ఇన్స్పెక్టర్ ఎన్. రమకాంత్ వారితో సమావేశం నిర్వహించి, వారి ట్రాక్టర్లకు సంబంధించిన అన్ని చట్టబద్ధమైన పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని, డ్రైవర్లు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్సుతోనే వాహనాలు నడపాలని, రోడ్లపై ట్రాక్టర్లను అధిక వేగంతో నడపకూడదని, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తే ప్రజల ప్రాణాలకు ప్రమాదమవుతుందని హెచ్చరించి, ట్రాఫిక్ నియమాలు పాటించాలని అవగాహన కల్పించారు.
- Advertisement -
