Monday, October 27, 2025
ePaper
Homeఆదాబ్ ప్రత్యేకంBoduppal | ఆదాబ్ కథనానికి స్పందించిన బోడుప్పల్ మున్సిపల్ కమిషనర్..

Boduppal | ఆదాబ్ కథనానికి స్పందించిన బోడుప్పల్ మున్సిపల్ కమిషనర్..

మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రతిరోజు ఏదో ఒకచోట అక్రమ నిర్మాణం.ప్రతీ అక్రమ నిర్మాణం వెనుక లంచం రూపంలో లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయనేది జగమెరిగిన సత్యం. ఆదాబ్ హైదరాబాద్ దినపత్రికలో వచ్చిన “అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ గా బోడుప్పల్ “కథనానికి స్పందించిన మున్సిపల్ కమిషనర్ విచారణ చేపట్టగా..

చెంగిచెర్ల రెండవ డివిజన్ సర్వేనెంబర్ 9 కోర్టు కేసులో ఉండగా 2023 వ సంవత్సరంలో అక్రమంగా ఇచ్చిన 6 ఇంటి పర్మిషన్లను గుర్తించి రద్దు చేయుటకు నోటీసులు జారీ చేస్తూ, ఈనెల 13వ తారీఖున మున్సిపల్ కార్యాలయంలో హాజరు కావలసిందిగా ఆదేశాలు జారీ చేశారు.

బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో టిపిఎస్ కావ్య బాధ్యతలు చేపట్టిన నాటినుండి నేటి వరకు వందల సంఖ్య లో అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తూ, మున్సిపల్ ఆదాయం గండి కొడుతూ వక్రమార్గంలో కోట్లకు పడగ లెత్తుతున్నది. చెంగిచెర్ల రెండవ డివిజన్ సర్వే నెంబర్ 9, 2019 సంవత్సరం నుండి కోర్టు వివాదంలో ఉన్నది.

హెచ్ఎండిఏ ఉత్తర్వుల ప్రకారం 2022 సంవత్సరంలో అప్పటి మున్సిపల్ కమిషనర్ పద్మజారాణి సర్వేనెంబర్ 9 కి సంబంధించి ప్రహరీ గోడను కూల్చి వేయడం జరిగినది. ప్రత్యర్థి మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా ప్రహరీ గోడను తిరిగి నిర్మించగా, కమిషనర్ పోలీస్ స్టేషన్ లో అతనిపై కేసు నమోదు చేయడం కూడా జరిగింది. 2023వ సంవత్సరం నవంబర్ మాసంలో టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రత్యర్థి ఇంటికి వెళ్లి సుమారు 18 లక్షలు తీసుకొని ఆరు ప్లాట్లకు అక్రమంగా ఇంటి పర్మిషన్లు ఇచ్చినట్టు బాధితులు చెప్పుకొచ్చారు.

కార్పొరేషన్లు అక్రమ నిర్మాణాలు మా దృష్టికి వచ్చినట్టయితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించే అధికారులను సహించం. అక్రమ పర్మిషన్ ఇచ్చిన సిబ్బందిపైన శాఖపరమైన చర్యలు తీసుకుని, అక్రమంగా ఇచ్చిన ఇంటి పర్మిషన్లను విచారణ చేసి రద్దు చేస్తామని  బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శైలజ అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News