Wednesday, February 11, 2026
Homeహైదరాబాద్‌JubileeHills | బీజేపీ మహా పాదయాత్ర

JubileeHills | బీజేపీ మహా పాదయాత్ర

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(JubileeHills Bye Election)లో లంకల దీపక్ రెడ్డి (Lankala Deepak Reddy) విజయం కోసం భారతీయ జనతా పార్టీ (Bjp) మహా పాదయాత్ర (Maha Paadayathra) నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు(RamchanderRao) రహ్మత్‌నగర్ డివిజన్‌(RahmathNagar Division)లోని పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభించారు. పాదయాత్రలో భాగంగా రాంచందర్ రావు గడపగడపకు వెళ్లి ప్రజలను పలకరిస్తూ, వారి సమస్యలు తెలుసుకున్నారు. రహ్మత్‌ నగర్ నుంచి శ్రీరాంనగర్‌కు వెళ్లే ప్రధాన రహదారి అక్రమ పార్కింగ్‌లతో నిండిపోయి ఉందని స్థానికులు చెప్పారు. దీనివల్ల ఒకవైపు డ్రైనేజీ వాసనతోపాటు డస్ట్‌బిన్లు నిండిపోవడంతో చెత్త రోడ్డు మీద పేరుకుపోయి పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. బస్తీల్లో డ్రైనేజీలు నిండిపోయినా అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News