Wednesday, March 25, 2026
Homeనల్లగొండMothkur | మున్సిపాలిటీకి నిధులు ఇచ్చేదే కేంద్ర ప్రభుత్వం

Mothkur | మున్సిపాలిటీకి నిధులు ఇచ్చేదే కేంద్ర ప్రభుత్వం

  • బద్దం నిషితమహేందర్ రెడ్డి

మోత్కూరు మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నికలలో ఐదవ వార్డు బిజెపి అభ్యర్థిగా తనను ఆశీర్వదించి మున్సిపల్ అభివృద్ధికి పాటు పడాలని అభ్యర్థి బద్దం నిశిత మహేందర్ రెడ్డి కోరారు.ఆదివారం బుజిలపురం ఐదో వార్డులోని ఇంటింటి ప్రచారం లో పాల్గొని మాట్లాడారు. మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే బిజెపి కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇస్తుందని, వాటిని అధిక మొత్తంలో సమకూర్చుకోవాలంటే బిజెపి అభ్యర్థులను ప్రజాక్షేత్రంలోకి పంపాలన్నారు.

వార్డులోని అసంపూర్తిగా ఉన్న సిసి రోడ్లను,డ్రైనేజీ వ్యవస్థను, విద్యుత్ సరఫరా పూర్తి చేయిస్తానని,యువతి, యువకులు తమ కాల పైన నిలబడటానికి విశ్వకర్మ యోజన పథకం అన్ని కుల వృత్తుల వారికి బిజెపి చేయూత ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నోముల వెంకన్న,గుంటి సతీష్,మల్లమ్మ,తీగల శ్రీధర్,మల్లేష్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News