కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) పుట్టినరోజు (Birth Day) సందర్భంగా బుధవారం ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandra Babu) శుభాకాంక్షలు చెప్పారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో మరింత కాలం దేశానికి సేవలందించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు అమిత్‌షాకి పుష్పగుచ్ఛం ఇస్తున్న ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ (Social Media Post) పెట్టారు. సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన(Foreign Tour)లో ఉన్న నేపథ్యంలో అమిత్‌షాను కలిసి శుభాకాంక్షలు చెప్పే అవకాశం లేకపోవటంతో సోషల్ మీడియా వేదికగా విశెష్ (Wishes) తెలిపారు.
