Thursday, February 12, 2026
Homeసాహిత్యంStories Competition | ‘భూపతి చంద్ర’ కథానికల పోటీ

Stories Competition | ‘భూపతి చంద్ర’ కథానికల పోటీ

సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని ప్రజ్ఞాపురంలో ఉన్న భూపతి చంద్ర మెమోరియల్ ట్రస్ట్ (Bhupathi Chandra Memorial Trust) కథానికల పోటీ నిర్వహిస్తోంది. సమకాలీన సామాజిక సమస్యలు(Social problems), మానవీయ విలువలు (Human values), వైవిధ్యమైన అంశాలతో కూడిన కథానికలకు ఆహ్వానం పలుకుతోంది. మొదటి బహుమతి రూ.10 వేలు, రెండో బహుమతి రూ.8 వేలు, మూడో బహుమతి రూ.6 వేలు, ప్రోత్సాహక బహుమతులు ఐదుగురికి (ఒక్కొక్కరికి రూ.2 వేలు) ఇస్తారు (Cash Prizes). కథానిక నాలుగు ఏ4 సైజ్ పేజీలకు మించి ఉండకూడదు.

కథానిక పత్రుల్లో రచయిత (Writer) పేరు రాయొద్దు. కథ పేరు, రచయిత పేరు, కులం, అడ్రస్, ఫోన్ వంటి వివరాలను విడిగా కథానికతోపాటు జనవరి ఒకటో తేదీ లోపు మెయిల్‌ ([email protected])లో లేదా వాట్సాప్(9959020513)లో లేదా పోస్ట్ లేదా కొరియర్ ద్వారా పంపొచ్చు. పోస్ట్ ద్వారా పంపాల్సిన చిరునామా.. సమన్వయకర్త, భూపతి చంద్ర స్మారక కథానికల పోటీ-2026, ఆనంద నిలయం, ఇంటి నంబర్ 1-5-1020/4, బీఆర్ రావు నగర్, ఓల్డ్ ఆల్వాల్, సికింద్రాబాద్, 500010. ఫోన్ నంబర్.. 9963616999.

- Advertisement -
RELATED ARTICLES

Latest News