Thursday, March 12, 2026
Homeబిజినెస్BHEL | భెల్ వాటా విక్రయానికి విశేష స్పందన..

BHEL | భెల్ వాటా విక్రయానికి విశేష స్పందన..

  • ఓ ఎఫ్ ఎస్ రూట్ లో నిర్వహించిన వేలంలో రూ. 5,650 కోట్లు బిడ్లు..
  • వివరాలు వెల్లడించిన దీపం కార్యదర్శి అరుణిష్ చావ్లా..

ప్రభుత్వరంగ విద్యుత్‌ పరికరాల తయారీ సంస్థ భెల్‌ వాటా విక్రయానికి సంస్థాగత మదుపరుల నుంచి విశేష స్పందన లభించింది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) రూట్‌లో ఐదు శాతం వాటా విక్రయానికి రిటైల్‌, సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి 1.34 రెట్ల బిడ్డింగ్‌లు దాఖలయ్యాయి. రెండు రోజుల పాటు ఓఎఫ్‌ఎస్‌ రూట్‌లో నిర్వహించిన వేలంలో రూ.5,650 కోట్ల బిడ్లు దాఖలయ్యాయని దీపం కార్యదర్శి అరుణిష్‌ చావ్లా ఎక్స్‌లో వెల్లడించారు. సంస్థలో ఐదు శాతం వాటా విక్రయించడంతో కేంద్ర ప్రభుత్వానికి రూ.4,400 కోట్ల నిధులు సమకూరనున్నాయి. షేరు ధర రూ.254గా నిర్ణయించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News