డిప్యూటీ సీఎం(Deputy CM) మల్లు భట్టివిక్రమార్క(Mallu Bhattivikramarka) ఆదివారం ములుగు జిల్లా మేడారం(Medaram)లో సమ్మక్క, సారలమ్మ తల్లులను దర్శించుకొని ప్రత్యేక పూజలు(Special Puja) చేశారు. అనంతరం మేడారం జాతర శాశ్వత అభివృద్ధి పనుల పురోగతిపై సహచర మంత్రులు, అధికారులతో కలిసి సమీక్షా సమావేశం(Review Meeting) నిర్వహించారు. సమ్మక్క–సారలమ్మ జాతర తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శాశ్వత నిర్మాణాలతో సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటేలా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఈ ఏడాది జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.260 కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు. ఇందులో జాతర నిర్వహణకు రూ.150 కోట్లు, శాశ్వత ఆలయ నిర్మాణాలకు రూ.110 కోట్లు కేటాయించామని స్పష్టం చేశారు. పనులు 85 శాతం పూర్తయ్యాయని, మిగిలినవి 15వ తేదీ లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. జాతర(Jatara) ముగిసే వరకు అన్ని శాఖల అధికారులు పూర్తి అప్రమత్తతతో పనిచేయాలని ఆదేశించారు. భక్తుల సౌకర్యమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని వివరించారు.
Sammakka-Saaralamma | మేడారంలో భట్టి పూజలు
By Aadab Desk
- Advertisement -
Previous article
Next article
