Tuesday, February 10, 2026
Homeఖమ్మంCongress | మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయం

Congress | మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయం

మునిసిపల్ ఎన్నికల్లో(Municipal Elections) కాంగ్రెస్ పార్టీ విజయం(Congress Party Victory) ఖాయమని డిప్యూటీ సీఎం(Deputy CM) మల్లు భట్టివిక్రమార్క(Mallu Bhattivikramarka) ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమం, నగరాల అభివృద్ధే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఈ మేరకు ఆయన మధిరలోని క్యాంప్ ఆఫీసులో ప్రెస్ మీట్ నిర్వహించారు. మునిసిపాలిటీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం మూడు రోజుల గడువు ఇచ్చిందని, ఆయా మునిసిపాలిటీల్లో బాధ్యత కలిగిన శాసన సభ్యులు, మంత్రులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు సమిష్టిగా చర్చించి గెలుపు సాధించే సామర్థ్యం ఉన్న అభ్యర్థులను ఎంపిక చేయాలని(Select Proper Candidates) సూచించారు. పార్టీ భావజాలాన్ని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగల నాయకులను ఏకాభిప్రాయంతో సెలెక్ట్ చేయాలని అన్నారు.

భట్టి ఇంకా ఏమన్నారంటే..

- Advertisement -

‘ప్రజల దృష్టితో, ప్రజల అభిప్రాయాలతో, సమన్వయంతో ఈ ప్రక్రియను విజయవంతం చేయాలని విజ్ఞప్తి. కాంగ్రెస్ ప్రభుత్వం నిజమైన ప్రజా ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో క్యాబినెట్ మొత్తం ప్రజా సంక్షేమం, నగరాల అభివృద్ధి దిశగా పనిచేస్తోంది. విద్య, ఆరోగ్యం, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్, అర్బన్ డెవలప్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టితో ముందుకుపోతున్నాం. నగరాల అభివృద్ధే తెలంగాణ భవిష్యత్తుకు పునాదులు. సంక్షేమ పాలనలో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీల్లో 90 శాతానికి పైగా అమలు చేశాం.

దేశంలో ఎక్కడా లేని విధంగా సన్న బియ్యం ఉచితంగా రేషన్ కార్డు దారులకు పంపిణీ చేస్తున్నాం. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా అమలుచేస్తున్నాం. దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న రేషన్ కార్డుల పంపిణీ, ఆరోగ్యశ్రీ పథకాన్ని రూ.10 లక్షలకు పెంపు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం పొందే ధైర్యాన్ని ప్రజలకు కల్పించాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను బలోపేతం చేసి గ్రూప్–1 సహా వివిధ పరీక్షలు నిర్వహించి పారదర్శకంగా ఫలితాలు ప్రకటించాం. వేలాది ఉద్యోగాలు నిరుద్యోగ యువతకు అందించాం.

విద్యే తెలంగాణ భవిష్యత్తును మార్చే శక్తి అని నమ్మి, ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ను 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నాం. ఇది తెలంగాణ విద్య రంగంలో గేమ్ చేంజర్ అవుతుంది. 2047 విజన్ 3 ట్రిలియన్ డాలర్ ఎకానమీ లక్ష్యం. అర్బన్, పెరి-అర్బన్, రూరల్, అగ్రో బేస్డ్ ఎకానమీని సమగ్రంగా అభివృద్ధి చేసే విధంగా రూపొందించిన 2047 విజన్ డాక్యుమెంట్‌ను గ్లోబల్ సమ్మిట్‌లో విడుదల చేశాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక నిపుణులు ఈ ప్రణాళికను అభినందించారు.

తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తీర్చిదిద్దడమే లక్ష్యం. పొత్తులకు సంబంధించిన అంశాలు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ఆధ్వర్యంలో చర్చించి నిర్ణయిస్తాం. పాలనలో ఎలాంటి గందరగోళం లేదు. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు అందరూ ఒకే కుటుంబంలా సమిష్టిగా పనిచేస్తున్నాం. మీడియాలో వస్తున్న అసత్య కథనాలను ప్రజలు నమ్మవద్దని హితవు పలికారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయం. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వచ్చిన ప్రజాభిమానమే పట్టణాల్లో కూడా కొనసాగుతుంది.

మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుస్తుంది. ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంతో ముందుకు సాగుతాం. మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక స్థానాల్లో గెలిపించి ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించి, తెలంగాణ అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములు కావాలి’ అని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News