Tuesday, February 10, 2026
Homeఖమ్మంBhatti | మధిరలో దివ్యాంగులకు ట్రై సైకిళ్ల పంపిణీ

Bhatti | మధిరలో దివ్యాంగులకు ట్రై సైకిళ్ల పంపిణీ

డిప్యూటీ సీఎం(Deputy CM), మధిర ఎమ్మెల్యే(Madhira Mla) మల్లు భట్టివిక్రమార్క(Mallu Bhattivikramarka) మంగళవారం తన నియోజకవర్గ కేంద్రంలో దివ్యాంగులకు(Disabled) ట్రై సైకిళ్ల(Tricycles)ను పంపిణీ చేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో దివ్యాంగుల సంక్షేమం కోసం రూ.100 కోట్లు ఖర్చుచేశామని చెప్పారు. దివ్యాంగ విద్యార్థులకు ఐప్యాడ్లు, ల్యాప్‌టాప్‌లు అందిస్తూ వారి ఉన్నత చదువులకు ప్రభుత్వం భరోసా ఇస్తోందని చెప్పారు. అంగవైకల్యం అనేది ఎదిగేందుకు అడ్డంకి కాకూడదని, దివ్యాంగులను సమాజంలో మనతో సమానంగా గౌరవప్రదమైన స్థితిలోకి తీసుకురావడమే లక్ష్యమని పేర్కొన్నారు. దివ్యాంగులకు అన్ని రకాల సంక్షేమ పథకాలు సక్రమంగా అందేలా చూస్తూ ప్రతి అడుగులోనూ ప్రభుత్వం తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News