భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) 119 మంది ట్రైనీ ఇంజనీర్(Trainee Engineer)లను తాత్కాలిక(Temporary) ప్రాతిపదిక నియమించుకునేందుకు ప్రకటన విడుదల చేసింది. ఇందులో ఎలక్ట్రానిక్స్ 65, కంప్యూటర్ సైన్స్ 6, మెకానికల్ 37, ఎలక్ట్రికల్ 8, కెమికల్ 1, ఫైనాన్స్ ఆఫీసర్ 2 ఖాళీలు ఉన్నాయి. ట్రైనీ ఇంజనీర్ ఉద్యోగాలకు బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంజనీరింగ్ డిగ్రీ) ఉత్తీర్ణులైనవారు అర్హులు. ఫైనాన్స్ పోస్టులకు ఎంబీఏ(ఫైనాన్స్) చేసినవారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైనవారికి నెలకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు ఇస్తారు. 2026 జనవరి 9లోపు దరఖాస్తు చేసుకోవాలి. జనవరి 11న రాత పరీక్ష(Written Test) నిర్వహిస్తారు.
- Advertisement -
