జీవో జారీ చేసిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) రాష్ట్రంలో భిక్షాటనను పూర్తిగా నిషేధిస్తూ (Ban) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ‘భిక్షాటన నివారణ (సవరణ) చట్టం- 2025’ అధికారికంగా ప్రచురితమైంది. ఈ చట్టం అమలుతో ఇకపై ఏపీలో ఎక్కడ భిక్షాటన చేసినా.. తీవ్రమైన నేరం(Serious Crime)గా పరిగణించనున్నారు. ఈ నెల 15న చట్టానికి గవర్నర్ (Governor) ఆమోదముద్ర వేయగా.. 27న ఏపీ గెజిట్(AP Gazette)లో చట్టం ప్రచురితమైంది. లా డిపార్ట్‌మెంట్ సెక్రటరీ గొట్టాపు ప్రతిభా దేవి సంతకంతో జీవో ఎంఎస్ నం.58 విడుదల చేశారు. ఈ చట్టాన్ని సంక్షేమ(Welfare), పోలీసు (Police) శాఖ సమన్వయంతో అమలుచేయనున్నాయి. రాష్ట్రంలో పెరుగుతున్న భిక్షాటన మాఫియా, వ్యవస్థీకృత భిక్షాటనను పూర్తిగా నిర్మూలించడం, నిరుపేదలకు పునరావాసం కల్పించాలన్న లక్ష్యంతో చట్టాన్ని తీసుకొచ్చారు.
