Wednesday, February 11, 2026
Homeరంగారెడ్డిIndiramma illu | పేదలు సంతోషంగా ఉండాలన్నదే కాంగ్రెస్ లక్ష్యం

Indiramma illu | పేదలు సంతోషంగా ఉండాలన్నదే కాంగ్రెస్ లక్ష్యం

  • ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేసిన భీమ్ భరత్ పామెన

మొయినాబాద్ : పేదలు, మహిళలు సంతోషంగా ఉండాలన్నదే కాంగ్రెస్(Congress) లక్ష్యమని చేవెళ్ళ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ భీమ్ భరత్ పామెన(Beem Bharath Pamena) అన్నారు. గురువారం ఆయన మొయినాబాద్(Moinabad) నక్కలపల్లి గ్రామంలో(Nakkalapalle village) ఇందిరమ్మ ఇండ్ల(Indiramma illu) మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేసి ఇంటి నిర్మాణ కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనంతరం భీమ్ భరత్ మాట్లాడుతూ.. పేదలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఇందిరమ్మ ఇండ్ల పథకం ఓ శాశ్వత పరిష్కారం చూపానుందని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలు సంతోషంగా ఉన్నప్పుడే రాష్ట్రం బాగుంటుందని, అందుకే ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను మహిళల పేరు మీద ఇవ్వడం జరుగుతుందని భీమ్ భరత్ పామెన తెలిపారు.

కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరి సతీష్, మొయినాబాద్ మండల అధ్యక్షులు మానయ్య, వైస్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి, యువజన కాంగ్రెస్ సీనియర్ నాయకులు నిరంజన్ గౌడ్, సర్దార్ నగర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ జైపాల్ రెడ్డి, బాకారం మాజీ సర్పంచ్ వెంకట్ రెడ్డి, సీనియర్ నాయకులు కరణ్, గణేష్, జైరామ్ రెడ్డి , కేబుల్ రాజు , చిలుకూరు రాజు, విఠల్ యాదవ్, ఇందిరమ్మ కమిటీ అధ్యక్షులు గౌరీ రవి, కమిటీ సభ్యులు మంగళవారం బుచ్చయ్య, గోపాల్ రెడ్డి, ఎల్లయ్య, కుమ్మరి సురేష్ , జీవన్, మంగళారం యాదయ్య, కొండరాజు, గౌరీ కృష్ణ, మంగళారం రాజు, ఎండి సమీ, దేవయ్య, కిషోర్, మల్లేష్, విట్టలయ్య, రాజు, పెంటయ్య, గ్రామస్తులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News