Wednesday, February 4, 2026
Homeహైదరాబాద్‌BC Support | మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు మద్దతు ఇవ్వాలి

BC Support | మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు మద్దతు ఇవ్వాలి

  • బీసీ సంక్షేమ సంఘం పిలుపు
  • బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ మోసం :కాంపాటి వెంకట్

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బీసీ జాక్ రాష్ట్ర కో–ఆర్డినేటర్,బీసీ శక్తి రాష్ట్ర అధ్యక్షులు,ఒస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ కాంపాటి వెంకట్ చేతులమీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కాంపాటి వెంకట్ మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను పూర్తిగా మోసం చేసిందని తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు.రాబోయే ఫిబ్రవరి 11వ తేదీన జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో బీసీలు పోటీ చేస్తున్న ప్రతి స్థానంలో బీసీలకే మద్దతు ఇచ్చి గెలిపించుకోవాలని ఆయన బీసీ ప్రజలకు పిలుపునిచ్చారు.రాజకీయంగా బీసీలు ఐక్యంగా నిలబడినప్పుడే తమ హక్కులను సాధించుకోగలమని పేర్కొన్నారు.

- Advertisement -

అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే కులగణనలో ఓబీసీ గెజిట్‌ను తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.గెజిట్ విడుదల చేసే వరకు దేశవ్యాప్తంగా ఉన్న బీసీ పార్లమెంటు సభ్యులు పార్లమెంటులో ప్రశ్నించి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి జేఏసీ చైర్మన్ స్వామి గౌడ్,విక్రమ్ గౌడ్,ఓయూ బీసీ విద్యార్థి ఇన్‌చార్జి రవీందర్,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News