బీసీ సంక్షేమ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ
బీసీ సంక్షేమ సంఘం(BC Welfare Association) 2026వ సంవత్సరం క్యాలెండర్‌ను ‘ఆదాబ్ హైదరాబాద్’(Aadab Hyderabad) దిన పత్రిక(News Paper) కార్యాలయం(Office)లో ఎడిటర్(Editor) వీరమల్ల సత్యం(Veeramalla Satyam) గురువారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్(BC JAC State Convener) జాజుల లింగం గౌడ్(Jajula Lingam Goud), ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్, బీఆర్ఎస్వీ నాయకుడు రవికిరణ్, బీసీ విద్యార్థి సంఘం ఓయూ ఇన్‌ఛార్జ్ గోదా రవీందర్, ఆలంపల్లి సతీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరమల్ల సత్యం మాట్లాడుతూ.. ప్రజలకు, బీసీ సంక్షేమ సంఘం సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం చేస్తున్న పోరాటాలను ప్రశంసించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 రిజర్వేషన్ల కల సాకారం కావాలని ఆకాంక్షించారు.
