Friday, March 6, 2026
Homeహైదరాబాద్‌Jajula Srinivas Goud | ఫిబ్రవరిలో బీసీల బస్సుయాత్ర

Jajula Srinivas Goud | ఫిబ్రవరిలో బీసీల బస్సుయాత్ర

బీసీ రిజర్వేషన్లు పెంచకుండా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తే సహించేది లేదు
బీసీ రిజర్వేషన్ల అమలుపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోవాలి
బీసీ రిజర్వేషన్లపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం
ఈ నెల 31న అఖిలపక్ష సమావేశం
ఫిబ్రవరిలో బీసీల బస్సు యాత్ర (Bus Yatra)
ఏప్రిల్‌లో హైదరాబాదులో బహిరంగ సభ
బీసీ జేఏసీ సమావేశంలో జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి

బీసీల రిజర్వేషన్ల(BC Resevations)ను 42 శాతానికి పెంచాకే ఎంపీటీసీ(MPTC), జెడ్పీటీసీ(ZPTC) ఎన్నికలు(Elections) నిర్వహిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy).. మాట తప్పారని బీసీ జేఏసీ(BC JAC) మండిపడింది. బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచకుండానే అసెంబ్లీ సమావేశాల్లో(Assembly Meeting) ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొనడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది.

- Advertisement -

హైదరాబాద్‌లోని సైబరాబాద్‌లో ఉన్న బీసీ జేఏసీ రాష్ట్ర కార్యాలయంలో ‘బీసీ రిజర్వేషన్ల పెంపు-భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ’పై బీసీ జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం(BC JAC Steering Committee Meeting) జరిగింది. సమావేశం అనంతరం బీసీ జేఏసీ చైర్మన్(BC JAC Chairman) జాజుల శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. సర్పంచ్ ఎన్నికలు ఏ పార్టీకీ అనుకూలంగా రాలేదని, బీసీల రాజకీయ చైతన్యంతో ప్రభంజనంలా జనరల్ స్థానాల్లో కూడా బీసీ సర్పంచ్‌లు గెలిచి తెలంగాణ రాష్ట్రంలో బీసీల రాజకీయ శకాన్ని ప్రారంభించారని తెలిపారు

బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లేలా ఈ నెల 29 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో రాజకీయ కార్యాచరణ ప్రకటించాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉంటామని అసెంబ్లీలో ప్రకటించిన రాజకీయ పార్టీలు ఇప్పుడు మాట మార్చి వ్యహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ఒక వైపు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, ఇంకో వైపు బీఆర్ఎస్ నాయకుడు హరీష్‌రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం సిగ్గుచేటన అన్నారు.

బీసీ జేఏసీ ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర బంద్ నిర్వహించడమే కాకుండా గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటాలు చేశామని గుర్తుచేశారు. ఇక నుంచి బీసీ జేఏసీ ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి ఈ నెల 31న హైదరాబాదులో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేయనున్నారు. అలాగే.. బీసీల రాజకీయ చైతన్యం వల్ల రాష్ట్రవ్యాప్తంగా గెలిచిన 5380 మంది బీసీ సర్పంచ్‌లతో సంక్రాంతి తర్వాత రాష్ట్ర స్థాయి ఆత్మీయ అభినందన సభను నిర్వహిస్తామని చెప్పారు. ఫిబ్రవరి రెండో వారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా బీసీల రథయాత్ర చేపడతామని తెలిపారు. అనంతరం.. ఏప్రిల్ మొదటి వారంలో లక్షలాది మందితో హైదరాబాద్‌లో ‘వేల వృత్తులు-కోట్ల గొంతులు’ అనే నినాదంతో భారీ బహిరంగ సభను నిర్వహించి బీసీల సత్తా చాటతామని అన్నారు.

ఈ సమావేశంలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, ప్రొఫెసర్ ఎం.బాగయ్య, ప్రొఫెసర్ సంఘవి మల్లేశ్వర్, బీసీ జేఏసీ కోచైర్మన్ కాటేపల్లి వీరస్వామి, బీసీ జేఏసీ వైస్ చైర్మన్ పిట్ల శ్రీధర్, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్, బీసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బి.మణిమంజరి, దీటి మల్లయ్య, జాజుల లింగం, మాధవ్ మేరు, నరాల సుధాకర్, గజ్జల సత్యం, తారకేశ్వరి, ఉదయ్ నేత, శివమ్మ, వెంకటేష్ గౌడ్, గూడూరు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News