- ప్రభుత్వానికి మార్చి 31 డెడ్‌లైన్ ముగింపు
- ఇక ప్రత్యక్ష పోరాటమేనన్న బీసీవై పార్టీ
పూలే- మండల్ భవన్ వేదికగా చారిత్రాత్మక ఆమరణ నిరాహార దీక్షకు ఏర్పాట్లు, బీసీలపై జరుగుతున్న దాడుల నుంచి, సామాజిక వివక్ష నుంచి వారిని కాపాడేందుకు ఎస్సీ ఎస్టీ తరహాలో బీసీ చట్టం తేవాలని పలు వక్తలు డిమాండ్ చేశారు. బీసీ డిమాండ్, హక్కుల సాధనకు ఈ నెల 11 నుంచి బోడె రామచంద్ర యాదవ్ బీసీ ధర్మ దీక్ష పేరుతో చేపట్టే నిరవదిక నిరహార దీక్షకు మద్దతు ఇస్తున్నట్లు బిసివై పార్టీ జిచ్ఎమ్సీ కన్వీనర్ తేజో విజయ కుమారి తెలిపారు.
సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ… బీసీ సింహగర్జనతో ప్రభుత్వానికి డెడ్‌లైన్ పెట్టిన ఆయన, మాట తప్పిన పాలకులకు, మడమ తిప్పని తన పోరాట పటిమతో సమాధానం చెప్పబోతున్నారని. ఏప్రిల్ 11 నుంచి, ఆయన చేపట్టబోతున్న బీసీ ధర్మ దీక్ష. బీసీల ఐదు ప్రధాన డిమాండ్ల సాధనే లక్ష్యంగా బీసీవై పార్టీ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుంటారని మా డిమాండ్ బీసీ రక్షణ చట్టం అమలు చెయ్యాలి. రాజధాని ప్రాంతంలో బీసీలకు వెయ్యి ఎకరాల భూమి కేటాయించాలి.

బీసీ కులాల కార్పోరేషన్లకు నిధులు విడుదల చెయ్యాలి. సమగ్ర కుల గణన చేసి, విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థలు, చట్టసభల్లో బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పించాలన్నారు. చెయ్యని పక్షంలో ఈ కార్యక్రమంలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు మేకల వివేక్ యాదవ్, గౌరిగారి ఆగమయ్య, వడ్డేపల్లి రామకృష్ణ , ఓరుగంటి వెంకటేశ్వర్లు, అమర్ ప్రసాద్ గౌడ్ తదితరులు పాల్గొని బిసి ధర్మ దీక్ష కార్యక్రమం గురించి వివరించారు.
ప్రభుత్వం బీసీల సహనాన్ని పరీక్షించవద్దని, వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని బీసీవై పార్టీ హితవు పలికింది. ఈ ధర్మ దీక్షకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బహుజన సమాజం, బీసీ సోదరులు, ప్రజాస్వామ్యవాదులు, మేధావులు సంఘీభావం తెలిపి, బిసి ధర్మ దీక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ పిలుపునిచ్చింది.
