Monday, October 27, 2025
ePaper
HomeతెలంగాణBC Bandh | బస్సుల బందుతో ప్రయాణికుల ఇబ్బంది

BC Bandh | బస్సుల బందుతో ప్రయాణికుల ఇబ్బంది

  • పండగ ముందు బంద్ నిర్వహణపై ఆగ్రహం.
  • బస్సుల నిలిపివేతతో బస్టాండ్లలో పడిగాపులు

దీపావళికి ముందు బంద్ నిర్వహించడంపై ప్రయాణికులు భగ్గుమన్నారు. పండగ ముందు బస్సులు బండ్ ఏంటని నిలదీసారు. బంద్ చేస్తున్న నాయకులతో పలుచోట్ల వాగ్వాదానికి దిగారు. బస్సులు అంద చేస్తే గ్రామాలకు ఎలా వెళ్లాలని అన్నారు. బీసీ బంద్ నేపథ్యంలో జూబ్లీ బస్టాండ్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. భాజపా ఎంపీ ఈటల రాజేందర్ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జూబ్లీ బస్ స్టేషన్లో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. మరోవైపు దీపావళి పండుగతో పాటు వారాంతపు సెలవులు ఉండడంతో వివిధ జిల్లాలకు వెళ్లాల్సిన ప్రయాణికులతో జేబీఎస్లో రద్దీ పెరిగింది.

ముందస్తు సమాచారం లేకపోవడంతో బస్ స్టేషన్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వీలైనంత త్వరగా బస్సులను ప్రారంభించాలని కోరారు. కుటుంబ సభ్యులు, చిన్నారులు, వయోవృద్ధులతో గంటల తరబడి బస్ స్టేషన్లో వేచి ఉన్నట్లు ప్రయాణికులు చెప్పారు. మరోవైపు ప్రధాన బస్టాండ్ ఎంజీబీఎస్లోనూ ప్రయాణికులు బస్సులు లేక పడిగాపులు కాసారు. కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, విజయవాడ, ఖమ్మం, సిద్ధిపేట, సూర్యాపేట, నల్గొండ తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు బస్సులు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఇదే అదనుగా క్యాబ్ డ్రైవర్లు అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారు. దీంతో ఆర్టీసీ బస్సుల కోసం ప్రయాణికులు బస్టాండ్లలో గంటల కొద్దీ నిరీక్షిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News