Friday, October 3, 2025
ePaper
HomeతెలంగాణBathukamma | ఘ‌నంగా బ‌తుక‌మ్మ ఉత్స‌వాలు

Bathukamma | ఘ‌నంగా బ‌తుక‌మ్మ ఉత్స‌వాలు

సికింద్రాబాద్ బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్న జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన కార్పొరేటర్లతో కలిసి సికింద్రాబాద్ బతుకమ్మ(Bathukamma) ఉత్సవాలలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్కిల్ పరిధిలోని స్వయంసహాయక సంఘాల(SHG) సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని బతుకమ్మ ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలు ఆకర్షణీయంగా కనిపించాయి. సాంప్రదాయ గీతాలు, నృత్యాలతో కార్యక్రమ ప్రాంగణం కళకళలాడింది. విజేతలకు ప్రోత్సాహక బహుమతులుగా 1వ, 2వ, 3వ స్థానాల్లో నిలిచిన బతుకమ్మలకు డిప్యూటీ మేయర్ స్వయంగా బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి గారు మాట్లాడుతూ, “బతుకమ్మ పండుగ తెలంగాణ సాంస్కృతిక ప్రత్యేకతకు ప్రతీక. ఈ ఉత్సవాల ద్వారా మహిళల ఐక్యత, సాంప్రదాయ విలువలు, సాంస్కృతిక వారసత్వం తరతరాలకు చేరవేయబడతాయి. ప్రభుత్వం మద్దతుతో ప్రతి సంవత్సరం బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం ఆనందదాయకం. మహిళల ప్రతిభను వెలికితీసే వేదికలుగా కూడా ఈ ఉత్సవాలు నిలుస్తున్నాయి” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, జిహెచ్ఎంసి సర్కిల్ సికింద్రాబాద్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఆంజనేయులు, డిపిఓ శ్రీనాథ్, అధికారులు, మహిళలు, పిల్లలు మరియు స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News