మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ విమర్శ
ప్రతిభ నగర్ బస్తీ దవాఖాన సందర్శన
జూబ్లీహిల్స్ (Jubileehills) నియోజకవర్గం రెహమత్ నగర్ డివిజన్ ప్రతిభ నగర్‌లోని బస్తీ దవాఖాన(Basti Dawakhana)ను మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud), మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి సందర్శించారు. బస్తీ దవాఖానలో ప్రజలకు అందుతున్న సౌకర్యాలను స్థానికులతో మాట్లాడి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ చిన్న చిన్న వ్యాధులకు పేదలందరికీ ఉచిత వైద్యం అందించే దిశగా కేసీఆర్ (KCR) ఆలోచించి బస్తీ దవాఖానలను ఏర్పాటుచేశారని చెప్పారు.

ఇక్కడ వైద్య పరీక్షలు, మందులు ఉచితంగా అందజేస్తారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government)లో బస్తీ దవాఖానాలకు సుస్తీ అయిందని విమర్శించారు. సరైన మందులు పంపిణీ చేయడం లేదని, అందులో పని చేసే వైద్యులకు, నర్సులను సుమారు 3 నుంచి 6 నెలల వేతనాలు అందించలేదని ఆరోపించారు.
