Thursday, March 5, 2026
Homeనిజామాబాద్‌Banswada MLA | పలు కార్యక్రమాల్లో పాల్గొన్న పోచారం

Banswada MLA | పలు కార్యక్రమాల్లో పాల్గొన్న పోచారం

బాన్సువాడ పట్టణంలో శనివారం జరిగిన పలు కార్యక్రమాల్లో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas Reddy) పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో రూ.27 లక్షల AWP నిధులతో నిర్మించిన 2 అదనపు తరగతి గదులను ప్రారంభించారు. రిటైర్డ్ ఎంప్లాయిస్ డే (Retired Employees Day) సందర్భంగా నిర్వహించిన సమావేశంలో పాల్గొని రిటైర్డ్ ఉద్యోగులను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. మీనా గార్డెన్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో (Christmas Celebrations) పాల్గొని క్రిస్టియన్ సోదర, సోదరీమణులకు ముందస్తుగా క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, బాన్సువాడ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News