Monday, January 19, 2026
EPAPER
Homeనిజామాబాద్‌Banswada MLA | అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న పోచారం

Banswada MLA | అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న పోచారం

బాన్సువాడ పట్టణ కేంద్రంలో ఆదివారం జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలను స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి(Pocharam Srinivas Reddy) తన చేతుల మీదుగా ప్రారంభించారు. మొదట బాన్సువాడ పట్టణ శివారులోని బోర్లం రోడ్డు పక్కన రూ.20 లక్షల SDF నిధులతో వారాల సంఘం భవన(Varala Sangham Building) నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం.. పాత బాన్సువాడ చావడి వద్ద రూ.15 లక్షలతో నిర్మించిన నూతన చావిడి భవనాన్ని(chavidi building) ప్రారంభించారు. చివరగా.. పాత బాన్సువాడ హనుమాన్ ఫంక్షన్ హాల్‌లో పొదుపు(SHG) మహిళలతో ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల మహిళలకు పెద్ద పీట వేస్తోందని చెప్పారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోందని తెలిపారు. ఇప్పటికే ఇందిరమ్మ క్యాంటీన్ల(Indiramma Canteens) నిర్వహణ బాధ్యతలను ఈ సంఘాలు విజయవంతంగా నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. మహిళలు కుటీర పరిశ్రమలను ఏర్పాటుచేసుకొని స్వయం ఉపాధి పొందాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రీస్(State Agros Industries) చైర్మన్ కాసుల బాలరాజు, బాన్సువాడ పట్టణ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News