Sunday, March 29, 2026
Homeఅంతర్జాతీయంYunus | యూనస్‌పై బంగ్లాదేశ్ అధ్యక్షుడు ఫైర్

Yunus | యూనస్‌పై బంగ్లాదేశ్ అధ్యక్షుడు ఫైర్

బంగ్లాదేశ్‌(Bangladesh)లో మహ్మద్ యూనస్(Muhammad Yunus) ఆధ్వర్యంలోని ప్రభుత్వంపై ఆ దేశ అధ్యక్షుడు(President) మహ్మద్ షాబుద్దీన్(Mohammed Shahabuddin) ఫైర్ అయ్యారు. సర్కారు తనను లెక్కచేయట్లేదని మండిపడ్డారు. పదవీ కాలం పూర్తికాకముందే వైదొలగాలని అనుకుంటున్నట్లు చెప్పారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా(Dhaka)లో ఉన్న అధికారిక నివాసం నుంచి ఒక వార్తా సంస్థకు ఆన్‌లైన్‌లో ఇచ్చిన ఇంటర్వ్యూ(Online Interview)లో ఆయన పలు విషయాలు వెల్లడించారు. అధ్యక్షుణ్ని అయ్యాక మీడియాతో మాట్లాడటం ఇదే తొలిసారి అని, దీన్నిబట్టి పరిస్థితి ఎలా ఉందో అర్థంచేసుకోవచ్చని చెప్పారు. ఎలక్షన్లు జరిగే దాక మాత్రమే ఉంటానని తెలిపారు. యూనస్‌తో ఏడు నెలలుగా ఒక్క భేటీ కూడా జరగలేదని పేర్కొన్నారు. అతనికి తాను రాసిన లేఖకు స్పందన రాలేదని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News