Sunday, February 22, 2026
HomeతెలంగాణBandi Sanjay | సీఎంగా రేవంత్‌ భాష పద్ధతిగా లేదు

Bandi Sanjay | సీఎంగా రేవంత్‌ భాష పద్ధతిగా లేదు

  • వేలకోట్లు సంపాదనలో ఓ ఇద్దరు మంత్రులు
  • ఆ ఇద్దరూ అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లక తప్పదు
  • కొంత మంది మంత్రులు భూ దందాలతో సంపాదన
  • దీన్ని తామే ఎప్పటికైనా బయటపెడతాం
  • కేంద్రమంత్రి బండి సంజయ్‌ కుమార్‌ విమర్శలు

రాష్ట్రంలో ఇద్దరు మంత్రులు వేల కోట్ల అక్రమ ఆస్తులు కూడబెట్టుకుంటున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్‌ ఆరోపించారు . వారిపై ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థల నిఘా ఉందన్నారు. ఎప్పటికైనా ఆ ఇద్దరు రాష్ట్రమంత్రులు జైలుకెళ్లడం ఖాయమని సంచలన కామెంట్స్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై కేంద్ర ప్రభుత్వం వద్ద అధారాలు ఉన్నాయన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొంతమంది మంత్రులు వేల కోట్ల భూములను అమ్ముకుంటున్నారని.. దీన్ని ఎప్పటికైనా బయటపెడతామని హెచ్చరించారు. ఇద్దరు లేదా ముగ్గురు మంత్రులు జైలుకెళ్లడం ఖాయమని ఆయన చెప్పారు. గురువారం విూడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. కేసీఆర్‌ మీద రేవంత్‌ రెడ్డి మాట్లాడిన భాష సరైంది కాదన్నారు.

ఇకపోతే ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు మాట్లాడే ముందు జాగ్రతగా ఉండాలని.. అంతేకానీ ఇలా దిగజారి మాట్లాడితే ఆ పదవికి ఉన్న గౌరవం తగ్గుతుందని బండి సంజయ్‌ హితవు పలికారు. మాజీ సీఎంపై రేవంత్‌ రెడ్డి వాడిన భాషవిూదే తెలంగాణలో ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతోం దన్నారు. నీటి వాటాల అంశంలో తప్పు చేసిందే కేసీఆర్‌ అని అన్నారు.సీఎం రేవంత్‌ రెడ్డి , మాజీ సీఎం కేసీఆర్‌ లపై కేంద్రమంత్రి బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పుడు రెండు రాష్టాల్ర మధ్య ఒప్పందం జరిగిందని.. నీటి పంపకాల అంశంలో అప్పట్లో తాను చేసిన వ్యాఖ్యలను ఓ ఐఏఎస్‌ అధికారి ట్వీట్‌ చేశారని గుర్తుచేశారు. కృష్ణా జలాల అంశంలో కేసీఆర్‌ తప్పుడు నిర్ణయాల వల్లే ఇందంతా జరిగిందని విమర్శించారు.

- Advertisement -

అనేకసార్లు అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో కేసీఆర్‌ తప్పించుకున్నారన్నారు. కేసీఆర్‌ను రేవంత్‌ తిట్టడం వెనక సింపతీ పెంచే కుట్ర దాగుందని.. కానీ ఇందుకోసం మరీ ఇంత జుగుప్సాకరమైన భాష అవసరం లేదన్నారు. తెలంగాణాకు పట్టిన పెద్ద శని కేసీఆర్‌ కుటుంబమని బండి ధ్వజమెత్తారు. కేసీఆర్‌ శని కాబట్టే ప్రజలు ఫామ్‌హౌస్‌కు పరిమితం చేశారని కామెంట్స్‌ చేశారు. కాళేశ్వరం స్కామ్‌ నుంచి తప్పించుకోవడానికే కేసీఆర్‌ కృష్ణా జలాల అంశాన్ని కొత్తగా తెరవిూదకు తెచ్చారని మండిపడ్డారు. కేసీఆర్‌ ప్రభుత్వం లాగే రేవంత్‌ రెడ్డి సర్కార్‌ కూడా పనిచేస్తోందని ఆయన ఆరోపించారు.

అప్పుడు పథకాల అమలుపై ప్రజలు నిలదీస్తారని కేసీఆర్‌ కొత్త అంశాలను తెరపైకి తెచ్చేవారని.. ఇప్పుడు రేవంత్‌ సైతం అదే డ్రామా ఆడుతున్నారని కేంద్రమంత్రి విమర్శించారు. కృష్ణా జలాల గురించి మాట్లాడే హక్కు మాజీ సీఎం కేసీఆర్‌కు లేదని కేంద్రమంత్రి బండి సంజయ్‌ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు దృష్టి మళ్లించడానికి కృష్ణా జలాల అంశం కేసీఆర్‌ లేవనెత్తుతున్నారని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా తానే అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం పెట్టించా అని చెప్పారు. ఇక కేసీఆర్‌పై సీఎం రేవంత్‌ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేయడాన్ని బండి సంజయ్‌ తప్పుబట్టారు. కేసీఆర్‌పై సీఎం రేవంత్‌ మాట్లాడిని భాష సరికాదన్నారు.

సీఎం తన భాషపై పునరాలోచన చేయాలి. ప్రతీ వ్యక్తి సుఖ సంతోషాలతో ఉండాలని హిందూ ధర్మం కోరుకుంటుంది. కేసీఆర్‌ కుమారుడు అహంకారం తలకెకినట్టు మాట్లాడుతారు. గతంలో కేసీఆర్‌ మాట్లాడితే మేము ఖండిరచాం. సీఎం రేవంత్‌ మాట్లాడిన తీరు ఆయనకే నష్టం’ అని కేంద్రమంత్రి బండి సంజయ్‌ అన్నారు. ’తెలంగాణకు నంబర్‌ వన్‌ ద్రోహి కేసీఆర్‌. కృష్ణా జలాల విషయంలో కేసీఆర్‌ ఏవిూ చేశారో ఆధారాలతో సహా బయట పెట్టింది ముందు నేనే. కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలకే ఒప్పందం చేసుకున్నారు. ముడుపుల కోసం 575 టీఎంసీలు అడగలేదు.

కేసీఆర్‌కు కృష్ణా జలాల గురించి మాట్లాడే హక్కు లేదు. అప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా నేనే అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం పెట్టించాను. కాళేశ్వరం స్కాం నుంచి దృష్టి మరల్చేందుకు కేసీఆర్‌ కృష్ణ జలాలు ఇష్యూ తెరపైకి తెస్తున్నారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌, కేసీఆర్‌ మధ్య ఏం ఒప్పందం జరిగిందో చెప్పాలి. కేసీఆర్‌ కుటుంబమే తెలంగాణకు పెద్ద శని. డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం’ అని బండి సంజయ్‌ పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News