మాజీ మంత్రి(Former Minister), బాల్కొండ ఎమ్మెల్యే(Balkonda Mla)(బీఆర్ఎస్ పార్టీ) వేముల ప్రశాంత్‌రెడ్డి(Vemula Prashanth Reddy) తన నియోజకవర్గ పరిధిలోని ఒక బాధిత కుటుంబానికి రూ.2 లక్షల ఎల్‌ఓసీ(LOC) అందజేశారు. మోర్తాడ్ మండలం ధర్మోరా గ్రామానికి చెందిన గజ్జెల గౌరీ.. గుండె సంబంధ సమస్య (Heart Problem)తో బాధపడుతున్నారు. ఓపెన్ హార్ట్ సర్జరీ(Open Heart Surgery) కోసం నిమ్స్ హాస్పిటల్(Nims Hospital)లో చేరారు. ఈ విషయాన్ని స్థానిక నేతలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా చికిత్స నిమిత్తం రూ.2 లక్షల ఎల్‌ఓసీ మంజూరుచేయించారు. సంబంధిత పత్రాన్ని శనివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో బాధితుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. లబ్ధిదారుడు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -
