అఖండ2 సినిమా ప్రీమియర్ షోలు రద్దు(Premiere Shows Canceled) కావటం, విడుదల వాయిదా (Release Postpone) పడటంతో ఖతార్(Qatar)లోని బాలయ్య అభిమానులు(Balakrishna Fans) తీవ్ర నిరాశకు గురయ్యారు. సినిమా నిర్వాహకులు ఇలా చేయకుండా ఉండాల్సిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటివి భవిష్యత్తులో మళ్లీ జరక్కుండా బాధ్యతగా ఉండాలని సూచించారు.
ప్రీమియర్ షోలు చూసేందుకు, రిలీజ్ రోజే పిక్చర్ వీక్షించేందుకు భారీగా ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నామని, ఇలా జరుగుతుందని ఊహించలేదని పేర్కొన్నారు. అఖండ2 పండగ చేసుకునేందుకు ఫ్యాన్స్, వాళ్ల ఫ్యామిలీలు, వాలంటీర్లు పెద్ద సంఖ్యలో రెడీ అయ్యారు. కానీ.. చివరి నిమిషంలో సినిమా నిర్వాహకులు తీసుకున్న నిర్ణయంతో ఉసూరుమన్నారు. అయినా.. బాలయ్యపై తమ అభిమానం తగ్గదని చెప్పారు.
- Advertisement -
