Tuesday, February 17, 2026
HomeతెలంగాణBahujana | బహుజన విద్యతోనే రాజ్యాధికారం..

Bahujana | బహుజన విద్యతోనే రాజ్యాధికారం..

  • రిటైర్డ్ డీజీపీ పూర్ణచందర్ రావు

వయోజన విద్య లాగా బీసీలకు బహుజన విద్యతో ముందుకు వెళ్తే రాజ్యాధికారం సిద్ధిస్తుందని, కర్పూరీ ఠాకూర్ వంటి మహానుభావుల స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని రిటైర్డ్ డిజిపి పూర్ణచందర్ రావు అన్నారు. లోక నాయక్, భారతరత్న బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ వర్ధంతి సందర్భంగా లకిడికపూల్ లోని మీడియా సెంటర్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది..

ఈ సందర్భంగా పూర్ణచందర్ రావు మాట్లాడుతూ జనాభాలో మనకన్నా తక్కువ శాతం ఉన్న అగ్రవర్ణాలు ఎమ్మెల్యేలుగా ఉన్నారని సీట్లు అడుగుతే మీ జనాభా ఎంతో చెప్పాలని అంటారు కానీ వాళ్ల జనాభా ఎంతో వాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో సమాజానికి చెప్పాలన్నారు.

- Advertisement -

కార్పొరేట్ ఠాకూర్ లాంటి మహానుభావుల గురించి సమాజానికి వారి గొప్పతనం గురించి అర్థమయ్యే విధంగా చెప్పాలని వాళ్ళ జాతుల బలోపేతం కొరకు మన ఓటు బ్యాంకును వాడుకుంటున్నారో అర్థమయ్యే విధంగా సమాజానికి తెలియజేయాలన్నారు.. ఉత్తర భారతదేశం నుంచి చాలామంది సీఎంలు అయ్యారనీ అక్కడ బీసీ భావజాలం బలంగా ఉన్నందునే సాధ్యమైంది అన్నారు. బీసీ ఉద్యమ నేత విజిఆర్ నారగోని మాట్లాడుతూ కాన్సిరాం మరియు కర్పూరి ఠాకూర్ సిద్ధాంతాలతోనే బహుజనులకు రాజ్యాధికారం సిద్ధిస్తుందని ఆ దిశగా బహుజనులందరూ అంతా ఏకమై తెలంగాణలో రాజ్యాధికారం కొరకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు సంగెం సూర్యారావు, గౌరవ అధ్యక్షుడు శివార్చక విజయకుమార్, బీసీ సమాజ్ రాష్ట్ర కన్వీనర్ మోడల శ్రీనివాస్ సాగర్, కర్పూరి ఠాకూర్ ఫౌండేషన్ చైర్ పర్సన్ సూర్యనారాయణ, బడేసాభ్, సీఎల్ఎన్ గాంధీ,ఆల్ ఇండియా ఓబిసి స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జి. కిరణ్ కుమార్, బీసీ సమాజ్ నాయకురాలు ప్రతిభ, చంద్రశేఖర్ ముదిరాజ్, ఆళ్ల రామకృష్ణ, ఓబిసి నాయకులు మహమ్మద్ యాకూబ్ భాష, ప్రముఖ పాత్రికేయులు సత్యనారాయణ, పాషా, ప్రముఖ దినపత్రిక కార్టూనిస్ట్ నారు, ఎంబీసీ సమాజ్ నాయకుడు విజయరాజు, ఎంబీసీ ఉద్యోగ సంఘ నాయకులు సుధాకర్ తదితరులు పాల్గొని జననాయక్ కర్పూరి ఠాకూర్ కు ఘనంగా నివాళులు అర్పించారు..

- Advertisement -
RELATED ARTICLES

Latest News