Sunday, April 5, 2026
Homeహైదరాబాద్‌Tribute | సామాజిక మార్పు కోసం పోరాడిన మహానేత జగ్జీవన్ రామ్

Tribute | సామాజిక మార్పు కోసం పోరాడిన మహానేత జగ్జీవన్ రామ్

  • అడ్డగుట్టలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
  • అణగారిన వర్గాల ఆశాకిరణం జగ్జీవన్ రామ్‌- మాజీ కార్పొరేటర్ లింగాని ప్రసన్నలక్ష్మి

స్వాతంత్ర్య సమర యోధుడు,సంఘ సంస్కర్త,మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఆదివారం నాడు ఆది జాంబవ అరుంధతి సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా అడ్డగుట్ట తాజా మాజీ కార్పొరేటర్ లింగాని ప్రసన్న లక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆమె బాబూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం ఆమె మాట్లాడుతూ…

దేశాభివృద్ధి, అణగారిన వర్గాల హక్కుల సాధనలో బాబు జగ్జీవన్ రామ్ చేసిన కృషి అమోఘమని కొనియాడారు. సమాజంలో సమానత్వం సాధించేందుకు ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను అనుసరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు వంగపల్లి పరుశురాం, కార్యదర్శి ఇరుగు బాబు, పశులాది యాదగిరి, గడ్డం మల్లేష్,మేడి నరేష్,సుంచు శ్రీశైలం, సుంచు సతీష్, బాలరాజ్,కట్ట ఎల్లయ్య, పసులాది నర్సింగ్, దశరథ్,బి.ఆర్.ఎస్ నాయకులు దాసరి శ్రీనివాస్,సత్తయ్య గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News