Wednesday, July 1, 2026
HomeసినిమాMupapa | మూవీ ఏప్రిల్ 19, 2027న రిలీజ్‌

Mupapa | మూవీ ఏప్రిల్ 19, 2027న రిలీజ్‌

బాలీవుడ్ వెర్స‌టైల్ స్టార్ ఆయుష్మాన్ ఖురానా హీరోగా యశ్ రాజ్ ఫిల్మ్స్‌, పోష‌మ్ పా పిక్చ‌ర్స్ బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘ముపాపా’. యశ్ రాజ్ ఫిల్మ్స్ సిఇఒ అక్ష‌య్ విదాని ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇండియ‌న్ మూవీస్‌లో ప్ర‌ముఖ షో ర‌న్న‌ర్‌, డైరెక్ట‌ర్‌ స‌మీర్ స‌క్సేనా ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈయ‌న నిర్మించిన గ‌త చిత్రం స‌యారా హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్ సాధించిన రొమాంటిక్ మూవీగా ఇండియ‌న్ సినిమాలో రికార్డ్ క్రియేట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ముపాపా చిత్రం వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి 19న రిలీజ్ కానున్న‌ట్లు మేక‌ర్స్ తెలియ‌జేశారు.

ఇండియ‌న్ ఎంట‌ర్‌టైన్మెంట్ ఇండ‌స్ట్రీలో ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్న పోష‌మ్ పా పిక్చ‌ర్స్ నేటి త‌రం ప్రేక్ష‌కులకు భిన్న‌మైన‌, స‌రికొత్త థియేట్రిక‌ల్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించాల‌నే ల‌క్ష్యంతో య‌శ్ రాజ్ ఫిల్మ్స్‌తో క‌లిసి సినిమాల‌ను నిర్మించ‌నుంది. అందులో భాగంగా ముపాపా సినిమా ప్రారంభ‌మ‌వుతోంది.

- Advertisement -

యశ్ రాజ్ ఫిల్మ్స్‌లో కొత్త క్రియేటివ్ బిజినెస్ మోడల్‌ను నిర్మించానే ఆదిత్య చోప్రా విజన్‌కు అనుగుణంగా ఈ భాగ‌స్వామ్యం ఉంది. కంపెనీ సీఈఓ అక్షయ్ విదాని నేతృత్వంలో.. ఆయన నిర్మాతగా స్టూడియో ఈ మోడల్‌ను వ్యూహాత్మకంగా అభివృద్ధి చేస్తున్నారు. మోహిత్ సూరి దర్శకత్వంలో వచ్చిన రొమాంటిక్ మూవీ స‌య్యారా తర్వాత నిర్మాతగా అక్షయ్ విదాని చేస్తున్న రెండో సినిమా ఇది.

“ముపాపా” ఓ వినూత్నమైన థియేట్రికల్ చిత్రంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. థియేటర్లలో ప్రేక్షకులకు పూర్తిగా కొత్త విజువల్ అనుభూతిని అందించనుంది. డిఫ‌రెంట్ కంటెంట్ మూవీస్‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోన్న‌ ఆయుష్మాన్ ఖురానా ఇందులో క‌థానాయ‌కుడు. అనౌన్స్‌మెంట్ నుంచే ఈ మూవీ ప్రేక్షకుల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

కాలా పానీ, మామ్లా లీగ‌ల్ హైస వంటి ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన సినిమాల్లో భాగ‌మైన పోషమ్ పా పిక్చర్స్ పార్ట్‌న‌ర్స్‌ సమీర్ సక్సేనా, బిస్వపతి సర్కార్, సౌరభ్ ఖన్నా, అమిత్ గోలాని ఈ ప్రాజెక్ట్‌లో భాగ‌మ‌య్యారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News