దీపావళి (Diwali) సందర్భంగా అయోధ్య(Ayodya)లో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డుల(Guinness World Records)ను నమోదు చేశాయి. అత్యధిక మంది ఒకేసారి ‘దియా’ భ్రమణం (‘diya’ Rotation) చేయడం ఒక రికార్డ్. 26 లక్షల 17 వేల 215 నూనె దీపాల ప్రదర్శన రెండో రికార్డ్. ఈ రికార్డుల సర్టిఫికెట్లను ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వీకరించారు. అక్టోబర్ 19వ నిర్వహించిన 9వ దీపోత్సవం అయోధ్య ఆధ్యాత్మికత, సంస్కృతి, సంప్రదాయాల శక్తివంతమైన కలయికకు అద్దం పట్టింది. చోటీ దివాలీని పురస్కరించుకొని సరయూ నది ఒడ్డున ఒడిశా పర్యాటక శాఖ, యూపీ ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం సంయుక్తంగా దీపోత్సవాన్ని నిర్వహించాయి.
