- సర్పంచులు:- కృష్ణవేణి, జంప నాయక్, దేవి
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో జోరుగా పర్యవేక్షణ, సహాయక కమిటీలను స్థానిక సర్పంచ్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ కమిటీలో స్థానిక సర్పంచ్ చైర్మన్ గా వ్యవహరించగా స్థానిక ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఒకరు, 1-3 సంవత్సరాల పిల్లల తల్లి ఒకరు, 4-6 సంవత్సరాల పిల్లల తల్లి ఒకరు, ఒక గర్భిణీ స్త్రీ, ఒక బాలింత తల్లి, ఆశా వర్కర్, ఆరోగ్య కార్యకర్త, యుక్త వయసు బాలిక ఒకరు, మహిళా సంఘాల అధ్యక్ష కార్యదర్శులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ప్రతినెల మొదటి శనివారం స్థానిక అంగన్వాడి టీచర్ కన్వీనర్ గా వ్యవహరిస్తూ సమావేశాన్ని నిర్వహిస్తారు.

దీనిలో భాగంగా శనివారం పర్వతగిరి మండల పరిధిలోని బూర్గుమళ్ళ, నారాయణపురం, రోల్లకల్ గ్రామాల పరిధిలోని అంగన్వాడి కేంద్రాలలో స్థానిక సర్పంచులు ఎలుకట్టే కృష్ణవేణి, మూడు జంప నాయక్, లునావత్ దేవి ఆధ్వర్యంలో పర్యవేక్షణ స్థాయి, సహాయక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ బాలింతలు, గర్భిణీలు స్త్రీలు ఆరోగ్యలక్ష్మి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

అలాగే మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలందరినీ ప్రీస్కూల్ కార్యక్రమాలకు పంపించి, అంగన్వాడి సేవలు సద్వినియోగము చేసుకోవాలని, అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే గుడ్లను, పాలను, బాలామృతాన్ని సేవిస్తూ ఆరోగ్యాన్ని, పిల్లలని కాపాడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బూర్గుమళ్ళ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు జగదీశ్వర్, ఉపసర్పంచ్ బొబ్బాల మధుకర్, నారాయణ పురం ఉప సర్పంచ్ కందికట్ల ఉమ, ఆయా గ్రామాల వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు కిరణ్, సుమన్, సుమలత, అంగన్వాడి టీచర్లు పి.లక్ష్మీ భవాని దేవి, సి.హెచ్ కోమలత, ఎం.కల్పన, ఆయాలు, ఆశా కార్యకర్తలు, కమిటీ సభ్యులు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పిల్లలు ఏఎన్ఎంలు పాల్గొన్నారు.
